Bulldozer Action: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధి మూత్ర విసర్జన కేసులో నిందితుడు ప్రవేశ్ శుక్లా నివాసాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కారు కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సర్కారు స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు.
Also Read: SBI Offer : రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు పొందే అవకాశం..
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా కుబ్రి గ్రామంలో చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో నిందితుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు కనిపించింది. నిందితుడు ప్రవేశ్ శుక్లా కుబ్రి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మంగళవారం ఈ విషయాన్ని గ్రహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు చేయాలని కోరారు.
నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదిలా ఉండగా.. రాజకీయ కారణాల కోసం ప్రసారం చేయబడిన పాత వీడియో అని నిందితుడి సోదరి చెప్పారు. ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం రేవా సెంట్రల్ జైలులో ఉన్నాడు.