విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాలు ప్రమాదభారిన పడుతున్నాయి. తాజాగా చైనాలో విమాన ప్రమాదం ప్రయాణికులను వణికించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్- మిషన్ 2 లో మంటలు చెలరేగాయి. ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పైప్ లైన్ దెబ్బ తినడం కారణంగా లీకేజ్ జరిగినట్టు గుర్తించారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. స్టీల్ ప్లాంట్…
స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడు అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో “శుభనందిని చిట్ ఫండ్” బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫాగ్ ద్వారా…
చైనాలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
బీహార్‌లోని అర్వాల్‌లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్‌పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్‌లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు.
మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు.
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటలు వచ్చాయి.