Minister Merugu Nagarjuna: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, బాలినేని మా నాయకుడు.. అందులో ఎటువంటి తారతమ్యం ఉండదు అని స్పష్టం చేశారు మంత్రి మేరుగు నాగార్జున.. ఆయన ఆధ్వర్యంలో మేమంతా పని చేస్తాం అని ప్రకటించారు.. ఇక, తన క్యాంపు కార్యాలయం దగ్గర బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫ్లెక్సీలను చించారటూ వస్తున్న వార్తలపై స్పందించిన నాగార్జున.. ప్లెక్సీలు నా క్యాంపు కార్యాలయంలో చినగలేదు.. అవి బయట చినిగాయని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలన్నారు మంత్రి నాగార్జున.. మరోవైపు.. వైఎస్ షర్మిలకు ఇంతకాలం గుర్తురాని ప్రత్యేక హోదా.. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు మేరుగు.. ఆమె ఎవరికోసం దీక్షకు దిగిందో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పంపిస్తే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిందని దుయ్యబట్టారు.. చంద్రబాబు డ్రామాల్లో ఇదొక నాటకం మాత్రమేనని విమర్శలు గుప్పించారు.
Read Also: Arrest Warrant to Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వంశీపై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ..
కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంత్రి మేరుగ నాగార్జున క్యాంప్ కార్యాలయం వద్ద కలకలం రేగింది. మంత్రి మేరుగ నాగార్జున క్యాంప్ కార్యాలయం వద్ద నూతన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి తగులబెట్టారు. సంతనూతలపాడు ఇంచార్జీగా భాద్యతలు తీసుకున్న అనంతరం ఒంగోలు లోని జిల్లా వైసీపీ కార్యాలయం పక్కనే మంత్రి మేరుగ నాగార్జున తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ అధిష్టానం ప్రకాశం జిల్లా, కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించింది.. ఈ నేపథ్యంలోనే మంత్రి మేరుగ నాగార్జున క్యాంపు కార్యాలయం ముందు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రికి రాత్రే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీల వరకే చింపిన గుర్తు తెలియని వ్యక్తులు వాటిని అక్కడే తగులబెట్టారు. మిగతా ఫ్లెక్సీలు మొత్తం అలానే ఉండగా కేవలం చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే చింపి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..