Arrest Warrant to Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..
Read Also: IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 103/2! మరోసారి నిరాశపర్చిన రోహిత్
అయితే, వివిధ సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనల సందర్భంగా వల్లభనేని వంశీపై కేసులు నమోదు అయ్యాయి.. అందులో నాలుగు కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి.. కానీ, ఆయన వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడంతో.. అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం.. అరెస్ట్ వారెంట్లపై వల్లభనేని వంశీ కౌంటర్‌కు దాఖలు చేసే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్లు మాత్రమే కాబట్టి.. అసలు వల్లభనేని వంశీ మోహన్.. కోర్టు విచారణకు ఎందుకు హాజరుకాలేకపోయారు అనే విషయాలను వివరిస్తూ.. అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. కాగా, వివిధ సమస్యలపై ఆందోళనలు నిర్వహించే సమయంలో.. ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఆ కేసులతో పాటు.. ప్రజా ప్రతినిధులపై ఇతర సందర్భాల్లోనూ నమోదైన కేసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోన్న విషయం విదితమే.