సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికేనని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుని లుచ్చా మాటలు అని ఆయన ఆరోపించారు. నిరుద్యోగికి 3 వేల నిరుద్యోగి భృతి అన్నాడు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకకి ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు తెచ్చాడా.. ఇంత బఫున్, జోకర్ మాటలు నమ్ముతారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, దొంగ మాటలు, మాయ చేసి ఓ వెయ్యి ఓట్లతో ఉప ఎన్నికలో గెలిచాడన్నారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుందని, కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు…పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అని ఆయన అన్నారు.
Also Read : Atchannaidu: మత్స్యకారుల బతుకుల్ని ఆగం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే సొంతం..
అంతేకాకుండా..’24 గంటల కరెంట్ ఎక్కడుందో చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లని గట్టిగా పట్టుకోండి. కరెంట్ ఉందొ లేదో తెలుస్తుంది… పీడ పోతుంది. తెలంగాణ లో పేద రైతులు ఉన్నారు…మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి. పబ్బు తెలుసు, గబ్బు తెలుసు వీళ్లకు. కాంగ్రెస్ లో రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. భట్టి ధరణి రద్దు చేస్తాం అంటాడు. ఉత్తమ్ రైతు బంధు దండగ అంటాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒర్రుబోతు..టీవీలలో కూర్చొని ఒకటే ఒర్రుతాడు. కాంగ్రెస్ వాళ్ళకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయి. గుజరాత్ నుంచి బిజెపి వాళ్లకి డబ్బులు వస్తున్నాయి. తెలంగాణాని ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ, అమిత్ షా, యోగి భోగి వెనుక 15 కేంద్రమంత్రులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, డీకే, సిద్ధ రామయ్య అందరూ బయలు దేరారు. ఎవరు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. ఎవడో కాంగ్రెస్ కార్యకర్త ప్రభాకర్ అన్నను కత్తితో పొడిచాడు. మనం ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి పోటు పొడవాలి. గాడిదలకు గడ్డి వేసి అవులకు పాలు పిండితే వస్తుందా.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Neha sharma : బీచ్ లో సందడి చేస్తున్న బర్త్డే బ్యూటీ నేహా శర్మ..