రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు వేములవాడ ఎట్లా ఉండే ఇప్పుడు మీరు చూడండన్నారు. తొమ్మిదన్నర ఏళ్లలో రెండేళ్లు కరోనాకి పోయింది ఏడాది ఎన్నికలకు పోయిందన్నారు. ఆరున్నర సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేశాడో మీ కళ్ళ ముందు ఉందన్నారు. మీ ఇంటి కుటుంబ సభ్యులతోనే ఆలోచన చేయండన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు వేములవాడలో కరెంటు ఎట్లా ఉందన్నారు.. ఈరోజు గోదావరి జలాలు ఇచ్చిన తర్వాత పుట్లకు పుట్లు వడ్లు పండుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. 2014 ముందు ఏం పథకాలు ఉన్నాయి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం పథకాలు ఉన్నాయి ఆడబిడ్డలు ఆలోచించాలన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఆడబిడ్డకు లక్ష 16 రూపాయలను కళ్యాణ షాదీ ముబారక్ ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. సర్కార్ దావకానకు మేము రాను అనే పరిస్థితులు పోయి… వంద పడక ఆసుపత్రి తిప్పాపూర్ లో ఏర్పాటు చేసాం… పేదలకు కాన్పులు చేస్తూ వైద్య సేవ అందుబాటులోకి రావడం మాకు ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
అంతేకాకుండా..’70 లక్షల రైతులు రైతుబంధు అందుకుంటున్నారు. 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చాం. 11 ఛాన్స్ ఇస్తే 55 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఇప్పుడు వస్తున్నారు.. విద్య బాగయింది, వైద్యం బాగైంది, సంక్షేమం అందింది, సాగునీరు అందింది… అయినా కేసీఆర్ ఏం చేయలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెల్ల రేషన్ కార్డును ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇస్తాం. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాక… 18 సంవత్సరాల నిండిన యువతులకు 3000 రూపాయలు ఇస్తాం. పెన్షన్ 5000 రూపాయలు ఇస్తాం. మన్మోహన్ సింగ్ నీతో ఐతలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 1200 చేశాడు సిలిండర్. హనుమంతుని గుడి లేని ఊరు లేదు… కెసిఆర్ సంక్షేమం అందని ఇల్లు లేదు. బంతి భోజనంలో ఉన్నవారికి అన్ని అందినట్లుగానే దళిత బంధు, బీసీ బందు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తాం. 55 ఏళ్లు ఒక రూపాయి కూడా గుడికి ఇవ్వలేదు. రాజన్న గుడి వేములవాడ పట్టణం అభివృద్ధి మా బాధ్యత. వేములవాడ గోదావరి జిలాల ను గుడి చెరువులోకి కూడా తీసుకువచ్చాం. 1965 ఒక తప్పు చేసినం… బలవంతం లగ్గం లోకి బయటకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరోసారి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా మీరు ఆలోచించాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.