Minister KTR : మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ, సీపీఎం నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని, నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 12 టిఆర్ఎస్ ను గెలిపించిన నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డబ్బులు, అహంతో ఢిల్లీ బాసులకు అమిత్ షా, మోడీ కి చెంప పెట్టు అని, కొలుబొమ్మ ఆట ఆడించిన అమిత్, మోడీకి ప్రాజె బుద్ధి చెప్పారు.
Also Read : Rudraraju Padma Raju: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అందరికీ స్ఫూర్తి
బీజేపీ అధికార మదాన్ని చైతన్య వంతులైన ప్రజలు తొక్కి పెట్టటు. ఢిల్లీ నుంచి వందల కోట్ల రూపాయలతో ఓటర్ల ను కొనుగోలు చేయాలని బీజేపీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్ది రోజుల కే బీజేపీ అధ్యక్షుడి అనుచరుడు కోటి రూపాయలతో, ఈటెల పిఏ 90 లక్షల డబ్బుల సంచులతో దొరికి పోయారు. ఆధారాలతో సహా బీజేపీ నేతలు దొరికిపోయారు. 75 కోట్లు వివేక్ తన కంపెనీ నుంచి బీజేపీ అభ్యర్థులకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా హావాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్ పని చేస్తున్నారు. సుశి ఇన్ఫ్రా నుంచి కోట్ల రూపాయలు ఓటర్లకు పంపారు. బీజేపీ అధికార దుర్వినియోగం చేసింది. 15 సీఆర్‌పీఎఫ్ కేంద్ర పోలీసు బలగాలు, 40 ఐటి బృందాలు వచ్చి మునుగోడు ప్రజలపై దండయాత్ర మాదిరిగా దాడి చేశాయి.
గెలుపును ఆపలేక పోయినా టిఆర్ఎస్ మెజార్టీని బీజేపీ వాళ్ళు తగ్గించారు. డబ్బు ప్రవాహం పెరిగిందని బీజేపీ చెబుతోంది. ఈటెల, రాజగోపాల్ వంటి ధనవంతులు ఎన్నికల్లో ఉన్నారు. ధన స్వామ్యాన్ని ప్రజాస్వామ్యం పై రుద్దే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది. బీజేపీ నేతలు కారు కూతలు కూస్తున్నారు. దుబ్బాకలో మేము స్వల్ప ఓట్ల తేడాతో మేము ఓడిపోయాము. కానీ మేము ఎవరి పై విమర్శలు చేయలేదు. గతంలో 74687 ఓట్లు టిఆర్ఎస్ వస్తే …. 97వేల ఓట్లు 2018 కంటే ఎక్కువగా వచ్చాయి. ఈసారి 43 శాతం ఓట్లు వచ్చాయి. గతంలో కంటే 9 శాతం ఓట్లు పెరిగాయి.
Also Read : Ghulam Nabi Azad: గుజరాత్, హిమాచల్‌లలో బీజేపీకి కాంగ్రెస్సే పోటీ.. ఆప్‌కు అంత సీన్ లేదు..
ఎన్నికల కమిషన్ ఎలా పని చేసిందో అందరికి తెలుసు. కారును పోలిన గుర్తులకు 6 వేల పై చిలుకు ఓట్లు పోయాయి. మెజార్టీ తగ్గడం పై మేము అనేక సాకులు చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థిని కొన్ని గ్రామాల్లో ఛీ కొట్టారు. ప్రచారంలో బిజెపి నేతలు టిఆర్ఎస్ వాళ్ళ పై దాడులకు తెగబడ్డారు. ఫేకుడు… జోకుడు తప్ప ఎన్నికల్లో బీజేపీ దగ్గర ఏమి లేదు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పని చేస్తుందో తెలియని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు’ అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.