దేశ స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది అసువులు బాశారు. అతి చిన్నప్రాయంలో తన జీవితాన్ని అర్పించారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు మాజీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు. కూకట్ పల్లి, నిజాంపేట్ ప్రగతి నగర్ మిథిలానగర్ లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు అభిమానులు, క్షత్రియ యూత్ పాల్గొన్నార. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ముఖ్య అతిధిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో vertex వర్మ, శివకుమార్ వర్మ, రమేష్ దాట్ల, ఠాగూర్ రమేష్, ఆంజనేయులు, కుచ్చర్లపాటి గోపాలకృష్ఱంరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Parachute Stunts At Rahul yatra: పారాచూట్ తో యువకుడి విన్యాసాలు.. వైరల్
ఈ సందర్బంగా రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. దేశంకోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతరాజు అని, ఆయన విగ్రహని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితం మనకు ఇస్తున్న సందేశం… కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడమే కాకుండా మన్నెంలోని గిరిజనుల అణచివేతకు వ్యతిరేకంగా వారిని పోరాటంలోకి దింపారన్నారు. కొండల్లో, అడవుల్లో తిరిగే కొండ జాతి ప్రజల్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాట యోధులుగా తీర్చిదిద్దాడని అన్నారు.
రామరాజును బ్రిటిష్ వారు మన్యానికి రాజును చేస్తామని, వందలాది ఎకరాలు ఇస్తామని ఆశలు చూపిన ఆయన లొంగకుండా కష్టాల పాలవుతూ గిరిజనుల దుర్భర పరిస్థితులు మారాలనే ఆశయంతో తన జీవితాన్ని అర్పించిన అమరజీవి అల్లూరి సీతారామరాజు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని అన్నారు. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశం… దేశభక్తికి త్యాగనిరతికి రామరాజు మనందరికీ ఆదర్శం అన్నారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాలను కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయన దేశభక్తికి నిదర్శనం అన్నారు పలువురు వక్తలు.
Read Also: Ghulam Nabi Azad: గుజరాత్, హిమాచల్‌లలో బీజేపీకి కాంగ్రెస్సే పోటీ.. ఆప్‌కు అంత సీన్ లేదు..