రాష్ట్ర సంక్షేమం కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజ శ్యామల యాగం నిర్వహిస్తామన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మే 12వ తేదీ నుంచి 6 రోజుల పాటు యాగం నిర్వహిస్తామన్నారు. ప్రతీ రోజూ ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానిస్తున్నాం. మొత్తం 450 మంది ఋత్విక్కులు ఈ యాగంలో పాల్గొంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. యాగం నిర్వహణ కోసం దేవాదాయశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీలు వేస్మతామన్నారు. ఈ యాగానికి ప్రజలను ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారికి నీరు, మజ్జిగ, ప్రసాదాలను అందజేస్తాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: CM JaganMohan Reddy: ఈ స్టాంపింగ్ విధానంతో ప్రయోజనాలెన్నో!
పార్టీలు వేరైనా రాజకీయ నాయకుల పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఇబ్బందేం లేదు. సామాజిక మాధ్యమాలు దీనికి వేర్వేరు భాష్యాలు చెబుతున్నాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఆయనకు ఆయనే తిట్టుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. వైసీపీని నోటికి వచ్చినట్టు తిడితే ప్రజల మద్దతు వస్తుందా..? లోకేషును పాదయాత్రలోనే జనం తరిమి కొడతారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే బ్రోకర్. ఆయన బినామీ ఆస్తులు ఎప్పుడో రెండు లక్షల కోట్లు దాటాయని ఆయన ఆరోపించారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు