Minister Karumuri Nageswara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. వైసీపీ ప్రభుత్వం రైతుల అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులపై చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
Read Also: Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. ఇప్పటికే రూ.827 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. మొలకెత్తిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఎగగొడితే జగన్ సర్కారు చెల్లించిందన్నారు. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో 17 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 31.26 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశామన్నారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. తాము రైతుల అకౌంట్‌లో నేరుగా జమ చేస్తున్నామన్నారు.