Harish Rao: చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. దేశానికే ఏపీ అన్నం పెడుతుందని హరీశ్ రావు తాను తినిపిస్తేనే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు అంటుండు.. ఇంకా నయం చార్మినార్ కూడా తానే కట్టానని అంటాడేమోనని హరీశ్ ఎద్దేవా చేశారు. ఏపీలో వరి సాగు 16 లక్షల ఎకరాల్లో జరిగితే.. తెలంగాణ లో 54 లక్షల ఎకరాల వరి నాట్లు వేశారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ కారణజన్ముడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు హరీశ్ రావు ట్రోఫిలను అందజేశారు.
Read Also: Revanth Reddy: గవర్నర్, ప్రభుత్వం ఒక్కటే.. అదంతా డ్రామా మాత్రమే
ఇదిలా ఉంటే.. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు బాగా కష్టపడి చదివి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను సిద్దిపేట సీపీ శ్వేతతో కలిసి మంత్రి హరీశ్‌రావు అందజేశారు.
Read Also: Nitin Gadkari: దేశంలోనే ఏపీ సమ్ థింగ్ స్పెషల్
కొద్దిరోజుల క్రితం చంద్రబాబు టీడీపీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆయనపై విమర్శలకు కారణమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోవడం ప్రారంభించారంటూ చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు ఆహారంగా తీసుకునే వారని.. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కే కిలో బియ్యం పథకంతో తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.