Delhi Water Crisis: ఢిల్లీలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి అదనపు నీటిని అందించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ సందర్భంగా హిమాచల్ నుంచి వచ్చే నీటిని ఢిల్లీకి తరలించాలని హర్యానాను ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా నీటిపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ప్రజలపై హర్యానా కుట్ర పన్నిందని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి ఆరోపించారు.
Read Also: Srisailam Mallanna Temple Hundi: శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు
ఇవాళ ఉదయం ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ లో హర్యానా కుట్ర బట్టబయలు! ఢిల్లీ నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది.. కానీ హర్యానా మాత్రం ఢిల్లీ ప్రజలపై కుట్ర చేస్తోందని ఆరోణలు గుప్పించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. గత మూడు రోజులుగా హర్యానా ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో కోత విధిస్తోంది.. హర్యానా కుట్రను బట్టబయలు చేసేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వజీరాబాద్ బ్యారేజీని సందర్శిస్తాను అంటూ మంత్రి అతిషి ఎక్స్ వేదికగా వెల్లడించింది. అదే సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం తన వైఫల్యాన్ని దాచడానికి హర్యానాపై నిందలు వేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. నీటి వృథాను అరికట్టడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. అవినీతి, నిర్వహణ లోపం కారణంగా ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది అని కమలం పార్టీ ఆరోపణలు చేస్తోంది.