ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ( గురువారం ) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు కోరింది.
రైతుల ఉద్యమం కారణంగా రహదారులను మూసివేయడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఐఎల్‌పై విచారణ సందర్భంగా.. రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేసే హక్కు ఉంది అని హర్యానా ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.