Minister Amarnath: అనకాపల్లిలో మంత్రి అమర్‌నాథ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై మండిపడ్డారు హౌసింగ్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరిపించాలని పీలా గోవింద్ ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తనపై చేసిన భూ ఆరోపణపై మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడివి, నా గురించి మాట్లాడడానికి నీ బ్రతుకేంటి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Also Read: Chandrababu: చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టులో విచారణ
నువ్వు సారా తాగి పెరిగితే, తాను పాలు తాగి పెరిగానంటూ మంత్రి పీలా గోవింద్‌పై ధ్వజమెత్తారు. నీ పేరే కబ్జా గోవింద, నీ ప్రభుత్వంలోనే నీపై 420 కేసు నమోదయిందంటూ ఆయన విమర్శించారు. పీక తెగినా తాను అవినీతికి పాల్పడను అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఐడీ కాదు సీబీఐ విచారణకైనా నేను రెడీ అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.