Minister Amarnath: ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్‌లోకల్ మధ్య పోటీ అంటూ మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదని ఆయన వెల్లడించారు. తొలిసారి దసరా పండుగను చంద్రబాబు జైల్లో గడిపే అవకాశం వచ్చిందని.. ఇలాగే నాలుగైదు పండుగలు చేసుకోబోతున్నారన్నారు. చంద్రబాబు జైల్లో వున్నాడనే బాధ టీడీపీ కార్యకర్తల్లో తప్ప కుటుంబ సభ్యుల్లో కనిపించడం లేదన్నారు. బాలకృష్ణ సినిమాలు, డ్యాన్స్ లతో ఖుషీగా ఉండటమే అందుకు నిదర్శనమన్నారు. లోకేష్ ఢిల్లీ టూర్, బ్రాహ్మణి, భువనేశ్వరి బిజినెస్ పనుల్లో, బాలకృష్ణ సినిమాల్లో బిజీబిజీగా వున్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read: AP CM Jagan: కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి జగన్
దొంగ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఎవరు ఎన్ని యాత్రలు చేసినా ఏపీ ప్రజలు విశ్వసించరన్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు బ్రేక్ వచ్చిందని లోకేష్ సంతోషిస్తున్నాడని ఆయన అన్నారు. పవన్, చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు అంటూ మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. వయసు మీద పడిన తరువాత తప్పులు చేయకూడదనే ఇంగితం చంద్రబాబుకు ఉండాలని.. ఆయన ఎంత కాలం జైల్లో ఉండాలనేది న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందన్నారు