నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ గా వున్నారు .ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలయ్య ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు .ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .
ఈ హై యాక్షన్ ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా UK రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది .మాస్ డైలాగ్స్ తో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .ఎన్నికలు ముగియగానే బాలయ్య ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు .