బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా ఆ చర్యను సవరించారు. తిరిగి రాజకీయ వారసుడిగా ఆకాష్‌నే నియమించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌తో కలిసి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Old AC Tips: మీరు పాత ఏసీని వాడుతున్నారా?.. దానిని ఎప్పుడు మార్చాలో తెలుసుకోండి..
ఈ ఏడాది మేలో ఆకాష్ ఆనంద్‌ను జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, ఆమె వారసుడిగా తొలగించారు. మాయావతి తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆకాష్‌ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్‌లో రాశారు. మళ్లీ ఇన్ని రోజులకు అదే పదవిలో మేనల్లుడ్ని నియమించారు.
2019లో సమాజ్‌వాదీ పార్టీతో మాయావతి పార్టీ తెగతెంపులు చేసుకుంది. పార్టీని పునర్వ్యవస్థీకరించడంతో పాటు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత ఏడాది డిసెంబర్‌లో మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్‌ను ఎంపిక చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఆకాష్ ఆనంద్‌పై కేసు నమోదైంది. ‘‘ఈ ప్రభుత్వం బుల్‌డోజర్ ప్రభుత్వం మరియు దేశద్రోహుల ప్రభుత్వం. తన యువతను ఆకలితో వదిలి, వృద్ధులను బానిసలుగా మార్చే పార్టీ ఉగ్రవాద ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అని ఆకాష్ అన్నారు. ఈ పరిణామంతో ఆకాష్‌పై మాయావతి వేటు వేశారు.
ఇది కూడా చదవండి: AP Speaker: దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న మాయావతి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఆమె మాజీ మిత్రపక్షం, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ 37 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇది కూడా చదవండి: Maoists: మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? ఆపరేషన్‌లో కీలక ఆధారాలు..