ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు. అయితే.. మంటలు వేగంగా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టాయి.
Read Also: Punjab: పంజాబ్‌లో రెండు చైనా డ్రోన్‌లతో సహా 60 డ్రోన్‌లను కూల్చిన బీఎస్‌ఎఫ్
ఈ క్రమంలో రికార్డ్ రూమ్ నుండి అల్మారాలు, బ్యారక్‌లు మరియు ఫైళ్ల వరకు ప్రతిదీ దగ్ధమైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో మెట్రో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం, గాయపడినట్లు నివేదికలు లేవన్నారు. అయితే అగ్నిప్రమాద ఘటనలో స్టేషన్‌లో నిల్వ చేసిన అనేక పత్రాలు, ఇతర కీలకమైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. సమగ్ర విచారణ అనంతరం తేలుస్తామని పోలీసులు తెలిపారు.
Read Also: Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..