తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసం కాగా.. ముగ్గురు మృతి చెందారు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్‌పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్. దీన్ని ఆనుకుని కొండచరియలు ఉన్నాయి.
ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు.
విధి ఆడే చదరంగంలో మనం ఓడిపోతూ వుంటాం. అన్నీ బాగున్నాయనుకునేలోపే అంచనాలు తలక్రిందులవుతాయి. కష్టపడి డబ్బు ఒక్కోసారి అక్కరకు రాకుండా పోతుంది. గుండె ఆపరేషన్ కొరకు కష్ట పడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా వుంటుంది. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీ కి చెందిన షేక్ మహబూబ్ బాషాకి అలాంటి పరిస్థితి ఎదురైంది. నాలుగు నెలలు క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి…