మంగళవారం ఉదయం నుంచి బీజాపూర్ లోని కోర్చోలి ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగాయి. ఇందులో భాగంగా కోర్చోలి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు 13 మంది నక్సలైట్ల స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో ఇది ఒకటి. మంగళవారం సాయంత్రం వరకు 10 మంది నక్సలైట్ల మృతదేహాల ను స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఇక ఇందులో భాగంగా బుధవారం ఉదయం సోదాల అనంతరం మరో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక సుమారు 8 గంటల పాటు ఎన్‌కౌంటర్ సాగింది.
Also read: Police Encounters: రెండు ఎన్‌కౌంటర్స్ లో 12 మంది మావోయిస్టుల మృతి..!
ఇక ఇప్పటివరకు మొత్తం 13 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యం చేసుకున్నారు పోలీసులు. మంగళవారం ఉదయం నుండి, DRG, CRPF, కోబ్రా బెటాలియన్ మరియు బస్తర్ బెటాలియన్ సిబ్బందితో నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం సోదాల అనంతరం మరో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..!
ఇకపోతే ఛత్తీస్గడ్ లో వరుస ఎన్కౌంటర్ లకు.. నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దింతో తెలంగాణ సరిహద్దు లో పోలీసుల అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే చర్ల దుమ్ముగూడెం ఏరియా లోని సరిహద్దు ల్లో ముమ్మర గాలింపు చర్యలు చెప్పాడుతున్నారు పోలీస్ బృందాలు. గత రాత్రి నుంచి మారు మూల గ్రామాలకు బస్ లను నిలిపివేసింది తెలంగాణ ఆర్టీసి. ఇక ఈ కాల్పులతో నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్ లో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు.