Police Encounters: రెండు ఎన్‌కౌంటర్స్ లో 12 మంది మావోయిస్టుల మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా పోలీసుల ఎదురుకాల్పుల్లో అభయ అరణ్యాలు కాల్పుల శబ్దాలతో దద్దరిల్లాయి. దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో సమావేశమయ్యారు. ఇక ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం పై మావోయిస్టులు సమావేశం నిర్వహించగా.. ఆ విషయం తెలుసుకొని పక్క ప్రణాళికలతో భద్రత బలగాలు వారిపై గాలింపులు చేపట్టాయి. దింతో భద్రత బలగాలకి ఎదురైన మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో మొత్తం పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రత బలగాలు తెలిపారు. ఇక మరోవైపు మధ్యప్రదేశ్ లో జరిగిన ఎదుఋ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: AP Pensions Issue: నేడు పెన్షన్ల పంపిణీపై ఏపీ హైకోర్టులో విచారణ..
Also Read
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశం కారణంగా.. మావోయిస్టు చర్యలు జరిపే అవకాశం ఉందని నియోజకవర్గాల పక్క సమాచారంతో సోమవారం రాత్రి సమయంలో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం కోర్చోలీ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. దాదాపు మూడు గంటల సమయం పాటు ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. మొదటగా కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు 4 మృత దేహాలు గుర్తించిగా మిగిలిన వారి కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. మరో ఆరు మృతదేహాలు వారికి లభించాయి. మరికొందరు తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుండి అనేక మందు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే చనిపోయిన మావోయిస్టులను పోలీసులు గుర్తించాల్సి ఉంది.
ఇక మరోవైపు మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన బాలాఘాట్ జిల్లా కేరజారి అటవీ ప్రాంతంలో తాజాగా బలగాలు మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తంగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ దాడుల్లో మరో మావోయిస్టు నేతకు గాయాలు అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కాల్పుల్లో మావోయిస్టులైన డిజిటల్ కమిటీ సభ్యురాలు సాజంతి అలియాస్ క్రాంతి, అలాగే ఆ ప్రాంత ఏరియా కమిటీ సభ్యుడైన రఘు అలియాస్ షేర్ సింగ్ కాల్పుల్లో మరణించారు. ఈ కాల్పుల్లో వారి నుంచి కాస్త మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరణించిన వారిపై ఇదివరకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రివార్డులను కూడా ఉంచింది.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!