Alluri Agency: అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా ఏళ్ల తరువాత ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు వెళిశాయి. హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి.. ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. "అమరవీరుల హిడ్మాకు జోహార్లు.. ఓ వీరుల నువ్వు కన్న కల దోపిడి లేని స్వేచ్ఛ దేశం నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో చరిత్ర…
అల్లూరి ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, ముంచింగి పుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాంతో అల్లూరి ఏజెన్సీలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. పిల్లలు, వృద్దులు బయటికి రావాలంటే బయపడిపోతున్నారు. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోంది. చలి తీవ్రతకు ఆపి ఉంచిన వాహనాల…
అల్లూరి ఏజెన్సీలో నిద్రిస్తున్న వ్యక్తిపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో జన్ని అప్పారావు అనే గిరిజనుడు తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి పాడేరులో చికిత్స జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి చేనుకు కాపలాగా పడుకున్న సమయంలో ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Virat Kohli History: సచిన్ మరో ప్రపంచ రికార్డు బద్దలు.. ఇక…
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి…
అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.