Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా 41 మంది కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులకు విముక్తి లభించింది. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్( NDRF ) యొక్క మూడు బృందాలు సొరంగం లోకి వెళ్లి కార్మికులను రెస్క్యూ చేశారు.
నవంబర్ 12న ఉత్తర కాశీలోని టన్నెల్ కుప్పకూలింది. దీంట్లో కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం బయటకు వచ్చిన కార్మికులన ఆరోగ్యం దృష్ట్యా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందుకోసం 41 అంబులెన్సులను సిద్ధం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య సదుపాయాలను చేరుకోవడానికి ‘గ్రీన్ కారిడార్’ ద్వారా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కార్మికులను ఘనంగా స్వాగతించారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు దేశంలోని నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా రంగంలోకి దిగి ఆ రెస్క్యూను విజయవంతంగా ముగించారు. ముందుగా అమెరికా నుంచి వచ్చిన ఆగర్ మిషన్ సాయంతో శిథిలాలను డ్రిల్లింగ్ చేసి, కార్మికుల్ని రక్షించాలని అనుకున్నప్పటికీ మిషన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ తర్వాత వర్టికల్ డ్రిల్లింగ్ ద్వారా రెస్క్యూ చేయాలని అనున్నారు. చివరకు పురాతన పద్దతైన ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా కార్మికులు ఉన్న ప్రాంతానికి సొరంగాన్ని చేశారు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా కార్మికులు బయటకు వస్తున్నారు. కార్మికులు బయటకు రావడంతో స్థానికులు స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Union Minister Nitin Gadkari tweets "I am completely relieved and happy as 41 trapped laborers in the Silkyara Tunnel Collapse have been successfully rescued…" pic.twitter.com/fMFiKeQMzQ
— ANI (@ANI) November 28, 2023
#WATCH | Uttarkashi tunnel rescue | Ambulances leave from the Silkyara tunnel site as all the workers trapped inside the tunnel since November 12 have been successfully rescued. pic.twitter.com/fJJ4Jfc3vw
— ANI (@ANI) November 28, 2023