జనసేన ఎంపీకీ లోక్‌సభలో కీలక పోస్టు దక్కింది.. లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. అయితే, బాలశౌరికి ఈ పోస్టు కొత్త కాదు.. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు.. చైర్మన్ తో పాటు 15 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్‌తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.…