తన ప్రేమని ఒప్పుకొకపోవడంతో ప్రేమోన్మాది యువతిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటిపై కాగిన నూనే పోయడంతో ఆ యువతి తీవ్రగాయాలపాలై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. ఈవ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలిసులు విచారణ చేపట్టారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల ప్రియాంక కాకినాడలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు అనుదీప్ కొద్దికాలంగా ప్రియాంకను వేదిస్తున్నాడు. మొదట్లో ఇద్దరు స్నేహితులుగా ఉండటంతో అనుదీప్ ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఇదే క్రమంలో ప్రియాంకను ప్రేమపేరుతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూనే ప్రేమించాలని వేదించడం మొదలు పెట్టాడు.
ఈక్రమంలో ఆమెను ఒక గదిలో నిర్భందించి వేదిచండం మొదలుపెట్టాడు. దాదాపు రెండు మూడురోజుల పాటు ప్రియాంకను వేదించిన అనుదీప్ ఆమెపై కాగుతున్న నూనేను పోసిమరీ టార్చర్ పెట్టాడు. ఈక్రమంలో తీవ్ర గాయాలపాలైన ప్రియాంక అతని నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రియాంకను రక్షించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. కాలిన గాయలపాలైన ప్రియాంక ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తమకూతురిని ప్రేమ పేరుతో వేధించిన అనుదీప్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఏలూరు త్రీటౌన్ పోలిసులకు ఫిర్యాదు చేసామని చెప్పుకొచ్చారు. తమ కూతురిని వేదిస్తున్న విషయంలో గతంలో అనుదీప్‌ను హెచ్చరించామని, అయితే ఆమెను గదిలో నిర్భంధించిన విషయం తమకు తెలియదని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రేమోన్మాధి దాడిలో గాయపడిన ప్రియాంకను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.
Read Also: Akhil Akkineni: ఆ హీరోయిన్ ను సెట్ లో వేధించిన అఖిల్.. నిజమేంటి ?
ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఇదే సమయంలో ఏలూరు ఆసుపత్రిలో బర్నింగ్ వార్డులో సౌకర్యాలులేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి వైద్య సిబ్బందికి ఫోన్ చేసిన చింతమనేని హాస్పిటల్లో సౌకర్యాల లేమిపై అధికారులను నిలదీశారు. ఇదే క్రమంలో వివాస్పద వ్యాఖ్యలు సైతం చేసారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, కలెక్టర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు.
ప్రేమ వ్యవహారంలో యువతిని తీవ్రంగా గాయపరిచిన అనుదీప్ పై ఏలూరు త్రీటౌన్లో కేసు నమోదు చేసారు. కోరిక తీర్చలేదని ఆమె వంటిపై వేడి నూనె పోసిన కారణానికి, అత్యాచారం, హత్యాయత్నం, బలవంతంగా నిర్భంధించడం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రియాంక, అనుదీప్‌లకు ఎప్పటి నుంచి పరిచం ఉంది.. వారిద్దరి మద్యప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు ఉంది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: V Hanumantha Rao: కాంగ్రెస్‌లో ఎవరు డబ్బులు తీసుకున్నారో నిరూపించాలి.. వీహెచ్ డిమాండ్