భారతదేశ సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు ప్రపంచదేశాలకు పాకుతున్నాయి. మన దేశంలోని దేవుళ్లను సైతం పలు దేశాల్లో ఆరాధిస్తున్నారు. అందరి బంధువు లార్డ్ హనుమంతుడి ఖ్యాతి కూడా ప్రపంచ దేశాలకు పాకింది. ఇందులో భాగంగానే రేపటి ( బుధవారం ) నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభమయ్యే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఈ ఏడాది ఎడిషన్‌కు ‘లార్డ్ హనుమాన్’ చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు. కాంటినెంటల్ గవర్నింగ్ బాడీ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
Read Also: Opposition Meeting: ఈ నెల 17-18న బెంగళూర్ వేదిక విపక్షాల భేటీ.. ఖర్గే ఆహ్వానం..
ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. హనుమంతుడు శ్రీరాముని సేవలో వేగం, బలం, ధైర్యం, తెలివితేటలతో సహా అసాధారణమైన సామర్థ్యాలను ప్రదర్శిశించాడు. బజరంగబలి యొక్క గొప్ప సామర్థ్యం అతని స్థిరమైన విధేయత, భక్తికి చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 యొక్క లోగో కూడా ఈ గేమ్‌లో పాల్గొనే అథ్లెట్లు, వారి నైపుణ్యం, వారి జట్టుకృషి, క్రీడ పట్ల వారి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది అని అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలిపింది. కాబట్టి మేము బజరంగబలిని మస్కట్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాము అని అసోసియేషన్ పేర్కొంది.
Read Also: Breaking: ‘’టైగర్ నాగేశ్వరరావు’’ యూనిట్ కి షాక్.. సినిమా నిలిపేయాలంటూ?
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 25వ ఎడిషన్ థాయ్ లాండ్ లో జరుగుతుంది. భారత్ నుంచి స్టార్ షాట్‌పుటర్ తాజిందర్‌పాల్ సింగ్ టూర్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ సారథ్యంలోని ఈ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శనలు చేయాలని ఆశిస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం భారత జట్టు ఇప్పటికే థాయ్ లాండ్ కు వెళ్లింది.