భారతదేశ సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు ప్రపంచదేశాలకు పాకుతున్నాయి. మన దేశంలోని దేవుళ్లను సైతం పలు దేశాల్లో ఆరాధిస్తున్నారు. అందరి బంధువు లార్డ్ హనుమంతుడి ఖ్యాతి కూడా ప్రపంచ దేశాలకు పాకింది. ఇందులో భాగంగానే రేపటి ( బుధవారం ) నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభమయ్యే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఈ ఏడాది ఎడిషన్‌కు 'లార్డ్ హనుమాన్' చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు.