హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ రేపటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 26.65 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క్‌ను గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరంభించారు. లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్స్‌కు అనుమతి ఉంటుంది. ఇక, నెలకు 100 రూపాయల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని హెచ్ఎండీఏ తెలిపింది.
Read Also: Madam Chief Minister: దర్శకనిర్మాతే హీరోయిన్ గా ‘మేడం చీఫ్ మినిస్టర్’
ఇక, అదే విధంగా ఈ లేక్ ఫ్రంట్ పార్కులో ఫంక్షన్లకు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. 11 వేల రూపాయలు చెల్లించి ప్రత్యేకంగా బర్త్ డే ఫంక్షన్స్, గెట్ టు గెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫంక్షన్స్ కి వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండీఏ ఈ పార్కులో అవకాశం ఇచ్చింది. పర్యాటకుల కోసం ఈ లేక్ ఫ్రంట్ పార్క్‌లో కరాచీ బేకరీ అవుట్ లెట్‌తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పార్కును సందర్శకుల కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. ఈ పార్క్ అందుబాటులోకి రావడంతో జల్ విహార్, PVNR మార్గ్ సమీపంలోని ఈ లేక్ ఫ్రంట్ పార్క్ సాధారణ ప్రజలకు కేంద్రంగా నిలవనుంది.