హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
Ganesh Immersion: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా రెండో రోజు కూడా భారీగా శోభయాత్రలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు హృదయపూర్వకంగా గణేశుని పరాయణం చేస్తూ శోభయాత్రను జరుపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వైపు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు అనేక గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు పాత బస్తీ ప్రాంతం నుంచి మార్కెట్ దాకా వేలాది మంది భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను…
Hussain Sagar: హైదరాబాద్.. నవాబులు పాలించిన ప్రాంతం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎంతోమంది రాజులు ఆయా ప్రాంతాలను పాలిస్తూ వచ్చారు. హైదరాబాద్ అప్పట్లో భాగ్యనగరంగా నవాబులు పరిపాలించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ కాలంలో నవాబులు కట్టించిన ఆయా కట్టడాలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వారి గుర్తుగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే చాలామందికి గుర్తు వచ్చే వాటిలో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, హైదరాబాద్…
Hussain Sagar: గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కాలువలు, చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు నీళ్లతో కలకాలాడుతున్నాయి. ఇందులో భాగంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ ప్రస్తుతం వరద నీటితో ఉప్పొంగిపోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో సరస్సు నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను దాటింది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాళాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు భారీగా వస్తోంది. ప్రస్తుతం…
GHMC: హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర నీటి స్థాయిలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సమీపంలోని కాలనీలకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని బట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం, వరద నీటి నిల్వ స్థాయి పెరుగుతున్న కారణంగా, ఈ ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. హాట్ లుక్స్…
HYDRA :నగరంలోని నాలాలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లడం సాధారణమైంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్‌కు వరదనీరు చేరే నాలా పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది. ఎన్నిసార్లు శుభ్రం చేసినా, టన్నుల కొద్దీ చెత్త తిరిగి బయటపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక బృందాలు ఈ నాలాలను శుభ్రం చేయడంలో బిజీగా ఉన్నాయి. టోలీచౌక్ సమీపంలోని హకీంపేట ప్రాంతంలో రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది బుల్కాపూర్ నాలాను శుభ్రం చేశారు.…
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
Fire Crackers Blast: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమం అనంతరం జరిగిన బాణసంచా పేల్చడంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో బాణసంచా పేల్చేందుకు రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని తీసుకెళ్లారు. టపాసులు పేల్చడం క్రమంలో, నిప్పు…
నిన్న భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై భారతమాత ఫౌండేషన్ స్పందించింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భాగ్యనగరంలో భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది.
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే. బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో బాణ సంచా సామగ్రిని సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు…