తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి.. 15 నెలల కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో చెప్పొచ్చని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు కోపం వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Viral News: సినిమా థియేటర్‌లో ఫ్రీ పాప్‌కార్న్.. ఏకంగా డ్రమ్ము నిండా తీసుకెళ్లిన వ్యక్తి ( వీడియో)
గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారని కేటీఆర్ అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ ఎన్నికతో గవర్నమెంట్ మారుతుందా.. తలకిందులు అవుతుందా..? అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్సీ ప్రచారం కోసం హెలికాప్టర్‌లో పోయి సిద్విలాసంగా మాట్లాడుతున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒకవైపు.. రైతుల ఆత్మహత్యలు, 8 మంది కార్మికులు ఇరుక్కుపోతే.. సోయి లేకుండా గాల్లో చక్కర్లు కొడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే మళ్లీ తాజాగా 36వ సారి ఢిల్లీకి పోయిండు.. 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం పీకారు.. 36వ సారి పోయి పీకేదేంది అంటూ ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు
36వ సార్లు ఢిల్లీకి వెళ్లి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు.. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేడు.. మంత్రులను నియమించుకోలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను, ఆయన ఆనవాళ్లను మాయం చేస్తానని అంటున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. తెల్లారిలేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు.. నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గరి దోస్తులకు ఇలా చెప్పుకున్నాడు.. మనం గెలుస్తలేం.. ప్రతిపక్షంలో ఉండి గట్టిగా కొట్లాడాలి.. కేసీఆర్ ఉన్నన్ని రోజుల గెలువం అని చెప్పుకున్నాడు.. కానీ ప్రజలు లక్కీలాటరీలో రేవంత్ రెడ్డిని గెలిపించారని కేటీఆర్ తెలిపారు. లక్ష రూపాయలు కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ఆడపిల్లల మనసు కొల్లగొట్టాడని కేటీఆర్ అన్నారు. రైతన్నలను కూడా అదే విధంగా మోసం చేశాడు.. కేసీఆర్ బిచ్చమేసినట్లు 10 వేలు ఇస్తే, తాను 15 వేలు ఇస్తానని.. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే, తాను 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది.. రోజుకు ఒక్కరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.