DK Aruna : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిచ్కుంద మండల కేంద్రంలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ బీజేపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. శాసన మండలిలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ల సమస్య లు సాధించుకునేందుకు బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కొట్లడతారని అన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న హామీలు నెరవేర్చనందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. గతంలో ఒక సింఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం మూడు జిల్లాలు తిరిగిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ఎమ్మెల్సీ ఓట్లను అడగాలన్నారు.
MLC Elections 2025: మేం మూడు స్థానాల్లో గెలుస్తున్నాం: కిషన్ రెడ్డి
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడలేదని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చందుకు రాష్ట్ర ఖజానా ఖాళీ అంటున్న రేవంత్ కు ఎన్నికల ముందు ఖజానా ఖాళీ ఉందని కనపలేదా అని ప్రశ్నించారు. అబద్దాల హామీల నెరవేర్చవలసి వస్తుందనే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలన బాగుంది కనుకనే దేశ ప్రజలు మూడు సార్లు బీజేపీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే మొన్న ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు సున్నాతో బుద్ది చెప్పారన్నారు. మోడీ పాలనను యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ కుళ్ళు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. సింఎం రేవంత్ కు దమ్ముంటే కాంగ్రెస్ లో చేర్చుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీలు గెలిచినా, ఓడినా ఒరిగేది ఏం లేదని అందుకే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలైన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపి బి.బి పాటిల్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిలం చిన్న రాజులు, జుక్కల్ మాజి ఎమ్మెల్యే టి అరుణతర తదితర పాల్గొన్నారు.
Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిల్..