టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఓడించాలంటే.. కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్‌లోకి రావాలంటూ వ్యాఖ్యానించారు. అయితే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు కేసీఆర్ కొట్టాలంటే అందరు కలిసి పనిచేయాలని, కానీ కాంగ్రెస్‌లో ఉండి కాదని బీజేపీలోకి వచ్చి కలిసి పని చేద్దామంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది కాంగ్రెసులతో కాదు బీజేపీ నాయకులతో పనిమీద వెళ్లి ఉంటాడు కాంగ్రెస్‌లోకి వెళ్తాడు అంటే నేను నమ్మనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : IPL 2023: శతకంతో చెలరేగిన క్లాసెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
కర్ణాటక ఫలితాలు కొంత కాంగ్రెస్‌కు బలాన్ని చేకూరుస్తాయి కానీ కేసీఆర్‌పై విజయం సాధించేంత కాదు కాంగ్రెస్ మీద జనం కి నమ్మకం లేదు కేవలం బీజేపీ మీదనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడో కాంగ్రెస్‌లో చేరేవాడు కేసీఆర్ కాంగ్రెస్‌ని మేనేజ్ చేస్తాడని భయంతోనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరకుండా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారని, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పిన బీజేపీ ఆ చర్యలు చేపట్టకపోవడంతో కొంత బీజేపీ మీద అనుమానాలు వస్తున్నాయని, కవిత అరెస్టు జరిగితే తెలంగాణలో పరిస్థితులు మారిపోతాయన్నారు.
Also Read : Karnataka CM swearing: కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం.. కేసీఆర్, మమతాతో సహా గెస్ట్ లిస్ట్ ఇదే..