Konda Surekha : జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. “మనిషిని బహిర్గతంగానూ, అంతర్గతంగానూ వికసింపచేసే విద్య మాత్రమే నిజమైన విద్య” అని స్పష్టం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా, మౌలానా ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ముఖ్యమైన పరిశోధనలు, ఉద్యమాలు ప్రజలకు అందించారని గుర్తు చేశారు.
AP Assembly Sessions: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా, “విద్యా కమిషన్”ను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిషన్ ప్రపంచ నిబద్ధతలతో పోటీ చేయగలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. త్వరలోనే నూతన క్రీడా పాలసీ రూపుదిద్దుకోనున్నది, ఇది విద్యార్థులను “ఆల్ రౌండర్లుగా” తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంది. ఆత్మన్యూనత నుంచి, చదువు బానిసత్వం నుంచి విద్యార్థులను విముక్తి చేయడం, విద్యార్థుల నిజమైన స్వేచ్ఛను ప్రసాదించడం, వారి జీవిత పరమార్థాన్ని వెలికితీయడం అనేది ఈ పాలసీకి ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఆమె యువతకు సైతం ఒక సందేశం ఇచ్చారు. “ఒక వ్యక్తి జ్ఞానాన్ని ఆర్జించినపుడు ఆ వ్యక్తి, ఆ సమాజం ఉన్నత శిఖరాలకు చేరగలుగుతుందని” అన్నారు. జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం ద్వారా సమాజంలో తమ పాత్రను పోషించాలని యువతను ప్రేరేపించారు.
Bhatti Vikramarka : క్రోని క్యాపిటల్స్ నుంచి జార్ఖండ్ ను రక్షించండి