CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారడానికి ప్రభుత్వమే కాకుండా, సమాజం కూడా జవాబుదారీగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…
విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు హాజరయ్యారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది.
ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని, ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యెక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదని ఆకునూరి మురళీ పేర్కొన్నారు. ‘ప్రైవేట్…
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.