Telangana: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ గతంలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇప్పుడు హామీలతో మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు .. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే ఈ నాయకులను నమ్మకండి అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే అని ఆరోపించారు. కల్లబొల్లి మాటలతో గ్యారెంటీగా అభివృద్ధి చేస్తాం అని మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి అని ఆయన సూచించించారు.
Read also:Gandhi Jayanti: గాంధీజీని మొదటిసారి మహాత్మా అని పిలిచింది ఎవరో తెలుసా..!?
60 ఏళ్ళు పరిపాలించి ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లకు ముందు ఉన్నటు వంటి అన్ని సమస్యలను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ అని తెలియ చేశారు. అప్పుల పాలైన రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని పేర్కొన్నారు .. రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రెండు విడతలలో 35 వేల కోట్లు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ అని మరోసారి గుర్తు చేసారు. గిరిజన యూనివర్సిటీ పేరు చెప్పి మాయ మాటలు మోస పూరిత వాగ్దానాలను ఇచ్చే బిజెపిని నమ్మవద్దని పేర్కొన్నారు ..