Gandhi Jayanti: తప్పు చేయడం మానవ సహజం. కానీ.. ఆ తప్పును సరిదిద్దుకుంటే మహాత్ములు అవుతారు. అనడానికి నిలువెత్తు నిదర్శనం గాంధీజీ. గాంధీజీ తన చిన్నతనంలో ఆకతాయిగా తిరిగేవారు. అయితే ఒకసారి ఆయన ఓ వీధి నాటకాన్ని చూసారు. ఆ నాటకం గాంధీజీని పూర్తిగా మార్చివేసింది. అప్పటి నుండి ఆయన సన్మార్గంలో నడిచారు. స్వాతంత్ర సంగ్రామంలో మార్గదర్శి తానై ప్రజలను ముందుకు నడిపారు. స్వాతంత్ర సంగ్రామంలో ఆయన సర్వం త్యజించారు. చివరికి స్వాతంత్రాన్ని సంపాదించి భరత మాత బానిస సంకెళ్లను తెంచారు. ఇన్ని చేసిన ఆ బోసి నవ్వుల తాత ఆయుధం అహింస. అందుకే ఆయన పుట్టిన రోజుని ప్రపంచవ్యాప్తంగా “అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా జరుపుకుంటారు.
Read also:Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
సత్యమేవ జయతే అని లోకానికి చాటిన చరిత ఆయన సొంతం. అయితే ఒకసారి గాంధీజీ శాంతినికేతన్‌కు వెళ్లారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్‌ని చూసారు. వెంటనే గాంధీజీ నమస్కారం గురుదేవ్” అని అన్నారంట. అప్పుడు వెంటనే ఠాగూర్ నేను గురుదేవ్ అయితే మీరు మహాత్మా అని అన్నారంట. కాలక్రమంలో ఆ మహాత్మ అన్న పదమే గాంధీజీ పేరుకు ముందు వచ్చి చేరి గాంధీజీ కాస్త మహాత్మ గాంధీజీగా పేరుగాంచారు. 1948లో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు గాంధీ. ఈ నేపథ్యంలో గాంధీని గాడ్సే హత్య చేశారు. దీనితో ఆ సంవత్సరం నోబెల్ కమిటీ బహుమతులను ప్రకటించలేదు. గాంధీజీకి సరితూగే వ్యక్తి ఎవరు లేరంటూ వేరెవరినీ నామినేట్ చెయ్యలేదు.