భారత్ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్చడానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీ ప్రకటించిన రోజు నుంచే మహారాష్ట్రలో కార్యకలాపాలను షురూ చేశారు. ఇక అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ పూర్ లో బీఆర్ఎస్ ప్రధాన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆఫీస్ ను ఓపెనింగ్ చేయనున్నారు.
Also Read : IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు
అనంతరం పార్టీ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించి.. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ జోష్ నింపనున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను స్టార్ట్ చేయాలని కేసీఆర్ ప్రణాళికలను రచిస్తున్నారు. అందులో భాగంగానే మొదటగా ఢిల్లీలో పార్టీ శాశ్వత కార్యాలయం ప్రారంభించగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనూ.. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓపెనింగ్ చేయనున్నారు. త్వరలోనే ఇంకా మహారాష్ట్రలోని పుణె, ముంబయి, ఔరంగాబాద్ లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Also Read : PM Modi: అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగులు బలంగా పడుతున్నాయి. అక్కడ గులాబి పార్టీకి బలమైన పునాదులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే 3.5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గత నెల 22న సభ్యత్వాల నమోదు మొదలు కాగా, ఈనెల 22వరకు ఆ డ్రైవ్ కొనసాగుతుంది. గడువు పూర్తయ్యేలోగా మరింత మంది మహారాష్ట్రలో బీఆర్ఎస్ సైనికులుగా మారతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం ఆధ్వర్యంలో కిసాన్ సెల్ ద్వారా 2 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇతర సంఘాల ద్వారా లక్షా యాభైవేల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.