IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపతున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో రెండో రోజు ఐటి సోదాలు కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక పైళ్ళ శేఖర్ రెడ్డి భార్య వనిత రెడ్డిని ఐటీ శాఖ అధికారులు నిన్న బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను ఓపెన్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల ఇల్లు కార్యాలయాలలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల పైనే ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈరోజు కూడా మొత్తం సోదాలు కొనసాగే అవకాశం ఉందని టాక్. దీంతో ఎమ్యెల్యేల ఇళ్ల వద్దకు కార్యకర్తలు.. అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐటి శాఖ సోదాలను ఖండిస్తూ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు అనుచరులు ఆందోళనలకు దిగడంతో ఎమ్మెల్యేల ఇంటి ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో నిన్న ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. మర్రి జనార్దన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ తో పాటు మరికొన్ని వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన క్లాత్ షోరూమ్‌ల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఇక భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పలు కంపెనీల్లో బినామీగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు సంబందించిన లావాదేవీల అంశాలపై అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
PM Modi: అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..
తాజావార్తలు
-
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘాట్ రోడ్లో అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!