Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. పరోక్షంగా స్పందిస్తూ.. భారత వృద్ధికి భయపడే వారు అలాంటి చర్యలు తీసుకుంటారని అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిరాశ నుంచి ఈ చర్యలు వచ్చాయని అన్నారు.
Husband carries wife’s body on Bike in Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో.. భర్త నిస్సహాయంగా ఉండిపోయాడు. తీవ్ర నిరాశకు గురైన భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన…
Nagpur Serial Bride: అందం, తెలివి తేటలు రెండూ ఉన్నాయి. పైగా టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కానీ తన అందాన్ని తెలివి తేటలను అమాయకులను మోసం చేయడానికి ఉపయోగించింది. పెళ్లిళ్ల పేరుతో చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకుని.. చివరికి తొమ్మిదో పెళ్లికి రెడీ అయింది. కానీ దురదృష్టం వెంటాడడంతో పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆ మాయలేడీ ఎవరు ? ఆ కిలాడీ కథేంటి? నిత్య పెళ్లికొడుకు.. వ్యవహారాలు…
Bride: ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిశా రామ్‌టేకే (30), చంద్రసేన్ రామ్‌టేకే (38) 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.…
ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ సజీవ సంస్కృతికి ఆధునిక అక్షయ వటవృక్షమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆదివారం నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారతీయ సంస్కృతికి, ఆధునికీకరణకు ఆర్‌ఎస్ఎస్ మర్రిచెట్టులాంటిదన్నారు
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్కి, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గుడు పడ్వా, ఉగాది పండగ సందర్భంగా ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన స్మృతి మందిర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపక నాయకులకు నివాళులు అర్పిస్తారని శనివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్, సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు. 1956లో…