ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీ ప్రకటించిన రోజు నుంచే మహారాష్ట్రలో కార్యకలాపాలను షురూ చేశారు. ఇక అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ పూర్ లో బీఆర్ఎస్ ప్రధాన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
KCR: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. ముందుగా కార్యాలయ ఆవరణలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో…