కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మసాలా బాండ్ కేసులో పినరయి విజయన్‌కు, మాజీ మంత్రి ఇస్సాక్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చింది. బస్ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్... అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించారు.
AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా.. సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో…
విమానాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే సంఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గురువారం (మే 30) దేశ రాజధాని ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం కొన్ని కారణాల వల్ల 24 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది.