A Indian did Love Marriage With French woman: తమిళనాడులోని తేని జిల్లా ముత్తుదేవన్‌పట్టికి చెందిన భోజన్, కాళియమ్మాళ్ దంపతుల కుమారుడు కళైరాజన్. ప్రభుత్వ రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేసిన భోజన్ మృతి చెందగా, కలైరాజన్ 2017లో ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లి చదువు కొనసాగించాడు. అక్కడ, కలైరాజన్ మరియం అనే ఫ్రెంచ్ మహిళతో చేసిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ విషయాన్ని ఇరువురు వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది మే నెలలో ఫ్రాన్స్‌లో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు తేని సమీపంలోని వీరపాండిలో వీరిద్దరూ తమిళ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకకు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు హాజరయ్యారు.
Read Also: Police Assaulted: బైక్‌ను ఆపినందుకు పోలీసును కొట్టిన తండ్రి కొడుకులు.. చివరకు?
ఈ విషయమై వరుడు కలైరాజన్ మాట్లాడుతూ.. ”గ్రాడ్యుయేషన్ కోసం ఫ్రాన్స్ వెళ్లినప్పుడు మరియమ్‌ను కలిశాను. మేమిద్దరం ప్రేమలో పడ్డాం. మా ఇంట్లో పరాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మొదట్లో కాస్త ఆలోచించారు. అయితే, మరియమ్‌కి తమిళ సంస్కృతి అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఆ తర్వాత వారు అంగీకరించారు. తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో మే నెలలో ఫ్రాన్స్‌లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తమిళ పద్ధతి ప్రకారం ఇక్కడే పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. ఇక వధువు మరియం మాట్లాడుతూ.. ”కాళిరాజన్, నేనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇండియాకి రావడం, తమిళ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. తమిళుల కుటుంబంలో నేనూ ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది.
Read Also: Fire In Train: కదులుతున్న రైలులో భారీగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు