మీ ఎలక్ట్రిక్ కారు హైవేపై వేగంగా దూసుకుపోతుంటే.. ఆటోమేటిక్‌గా బ్యాటరీ ఛార్జ్ అవుతుందని ఓసారి ఊహించుకోండి. ఆ ఊహ ఎంతో బాగుంది కదా?. కేబుల్స్ పెట్టకుండా, ఛార్జింగ్ స్టేషన్లు లేకుండా, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అవుతుంది. మీరు చూస్తుంది నిజమే.. ఇది ఫ్రాన్స్‌లో జరుగుతోంది. రన్నింగ్ వాహనాలను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్‌వే ఫ్రాన్స్‌లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రయోగం సాంకేతికంగా విప్లవాత్మకమైనది మాత్రమే కాదు.. భవిష్యత్…
ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రుల మార్పిడి ఆట సాగుతోంది. ఎప్పుడు.. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారారంటే ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందో ఈపాటికే అర్థమైంటుంది.
ఫ్రాన్స్ నూతన ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల కిందటే ఆ పదవిని చేపట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు మాక్రాన్ సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజీనామాకు గల కారణం ఏంటంటే? ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన కొత్త మంత్రివర్గాన్ని నియమించిన కొన్ని గంటలకే రాజీనామా చేశారు. తన మిత్రదేశాలు, ప్రత్యర్థుల నుండి తన…
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న సెబాస్టియన్‌ను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించారు. ఫ్రాంకోయిస్ బేరో ప్రధాని పదవికి రాజీనామా చేయగానే.. సెబాస్టియన్ లెకోర్నును ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నియమించారు.
Helicopter Crash: సాధారణంగా వాహనాల ప్రమాదాల వీడియోలు చూసినప్పుడు ప్రజలు భయబ్రాంతులకు లోనవుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బైక్, కారు, బస్సు, లారీ ఇలా వాహనాల యాక్సిడెంట్స్ కు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదం వీడియో అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియోలో.. ఒక హెలికాప్టర్ జలాశయం నుంచి నీరు నింపే…
జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ మతం. కానీ ప్రస్తుతం అది సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు దూరమవుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. గత దశాబ్దంలో ప్రపంచంలోని మరో నాలుగు దేశాలు క్రైస్తవ దేశం హోదాను కోల్పోయాయని ప్యూ రీసెర్చ్ విశ్లేషణలో తేలింది. అంటే ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న ఈ నాలుగు దేశాల్లో క్రైస్తవ జనాభా తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్‌లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్‌లతో కూడిన 19 ప్యాలెట్‌లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు.
ఇజ్రాయెల్‌పై మిత్ర దేశం ఫ్రాన్స్ స్వరం మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గళం విప్పారు. గాజా పట్ల ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్‌కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌ని కాళ్ల బేరానికి తెచ్చాయి.