విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నియోజికవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 50వేల ఓట్లకు ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు.