తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
Bandi Sanjay : గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ ఎల్లమ్మ ఆలయం ఆవరణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రాజకీయ విమర్శలతో గత ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అలాగే ప్రవర్తిస్తుందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేశాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం సకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.…