బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. స్పీకర్ వద్ద అబద్దాలు చెబుతూ, పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా…
Pragya Singh Thakur: బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. “బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి డ్రామాలు చేస్తోంది. ఆర్. కృష్ణయ్యతో సహా కొంతమంది బీసీ నేతలు కూడా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధి చూపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అధికారంలోకి…
Russia: ఇటీవల కాలంలో రష్యా, పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఇంజన్లు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో కాంగ్రెస్, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే, వీటన్నింటిపై రష్యా క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి.
Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా…
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్‌లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని…
గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి…