టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు అవుతున్నాయి. పట్టణంలోని కొండారెడ్డి కాలనీ కౌసర్ మసీద్ ముత్తు వలితో పాటు ఆయన అనుచరులు సుమారు 35 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక వీరిని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్తు వల్లి మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ప్రభుత్వాలను ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశాను కానీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పనితీరు అద్భుతంగా ఉంది అని కొనియాడారు. 2024 ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా కష్టపడి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు.
Read Also: Shubman Gill: ఓటమి బాధ నుంచి కోలుకోని టీమిండియా ఆటగాళ్లు.. 16 గంటలు గడిచాయని పోస్ట్
ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ముత్తువల్లి పేర్కొన్నారు. సీఎం జగన్ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని వాటిని కేపీ నాగార్జున రెడ్డి ప్రజలకు అందజేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి నాగార్జున రెడ్డికి ప్రజలు మద్దుతుగా నిలిచి గెలిపించాలని కౌసర్ మసీద్ ముత్తు వలి కోరారు.