బహిరంగ, రద్దీ ప్రదేశాల్లో ధూమపానం చేయడాన్ని అనేక దేశాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి గడిచిన 14 సంవత్సరాలలో ఏకంగా 4, 512 సార్లు స్మోకింగ్ బ్రేక్ తీసుకున్నాడట. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానా విధించారు. అతడికి 14, 700 సింగపూర్ డాలర్ల (రూ.8.8లక్షలు) జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Pakistan Crisis: పాక్ లో గోధుమ సంక్షోభం..పిండి కోసం ట్రక్కును వెంబడించిన వందలాది మంది.. వీడియో వైరల్..
జపాన్‌లోని ఒసాకా నగరానికి చెందిన ఆర్థికశాఖలో డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారితోపాటు మరో ఇద్దరు అధికారులు కార్యాలయ సమయంలోనే ధూమపానం చేస్తున్నారట. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోన్న ఈ ముగ్గురుపై 2022 సెప్టెంబర్‌లో ఆ కార్యాలయ మానవ వనరుల విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో వారికి సమన్లు జారీచేసిన అధికారులు.. మరోసారి ధూమపానం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని ఆ అధికారులు.. అలాగే నిబంధనలు అతిక్రమిస్తూ స్మోకింగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. దీనిపై గతేడాది డిసెంబర్‌లో మరోసారి ఫిర్యాదు రావడంతో విచారించిన అధికారులకు.. తాము ధూమపానం చేయలేదని చెప్పారట.
Also Read : BAN Vs IRE: లిటన్ దాస్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డుకు బ్రేక్
దీంతో ఆఫీస్ సమయంలో వారు తీసుకున్న బ్రేక్‌ల వివరాలను బయటకు తీశారు. వీరిలో డైరెక్టర్ స్థాయి అధికారి డ్యూటీ సమయంలో ఏకంగా 355 గంటల 19నిమిషాలు ధూమపానానికే కేటాయించిన విషయాన్ని జిల్లా అధికారులు బయటపెట్టారు. ఇలా గడిచిన 14 ఏళ్లలో 4,512 సార్లు స్మోకింగ్ బ్రేక్ తీసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు జీతంలో కోత (ఆరునెలల పాటు పది శాతం) విధించాడంతోపాటు 1.44 మిలియన్ యెన్‌లను జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Also Read : Virat Kohli : నా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఇద్దరు స్టార్లే
మరోవైపు ఒసాకాలో 2019లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ హైస్కూల్‌లో పనిచేసే టీచర్ 3, 400 సార్లు స్మోకింగ్ బ్రేక్ తీసుకున్నాడట. దీంతో అతడిపై చర్యలు తీసుకున్న అక్కడి విద్యాశాఖ.. 10లక్షల యెన్‌లు జరిమానా విధించింది. అయితే, ఇది జరిగిన తర్వాత కూడా.. ‘ఇదో చెడు అలవాటు అయినప్పటికీ దీన్ని మానుకోలేకపోతున్నాను’ అని అక్కడి బోర్డుమీద సదరు టీచర్ రాయడం గమనార్హం. ధూమపానం నిషేధం విషయంలో ప్రపంచంలో అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే ప్రాంతాల్లో జపాన్‌లోని ఒసాకా ఒకటి. ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధాన్ని పదిహేనేళ్ల క్రితం నుంచే కఠినంగా అమలు చేస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనివేళల్లో పొగతాగడంపై నిషేధం విధించింది.