QG Gang War Trailer: జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు టి. ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్, శ్రీను , శివనాగు, నిర్మాత వేణుగోపాల్, ఎన్టీఆర్ శ్రీను, తదితరులు హాజరయ్యారు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈనెల 30న ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. పూర్తి కమర్షియల్ అంశాలతో, పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులు కోరుకున్నారు.
Read Also: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తొలి షో అప్పుడే!
ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ట్రైలర్ చూసిన వాళ్లు తప్పకుండా థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారని, తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, శివనాగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అని, ప్రేక్షకులందరికీ కచ్చితంగా ఏ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ కుమార్ కన్నన్ తెరకెక్కిస్తుండగా.. డ్రమ్స్ శివమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.