మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంలేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో రోజురోజుకు గ్రాఫ్ పడిపోయింది.. త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
Read Also: HDFC Bank: బ్యాంక్ కొత్త స్కీమ్..రూ. 5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు మీ సొంతం..
రిజర్వేషన్ల మార్పు, త్రిబుల్ తలాక్ వంటి విధానాలను తీసుకువచ్చి దేశాన్ని బీజేపీ పార్టీ విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నిస్తోందని కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుంది.. తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించి, ఖజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Diabetes: డయాబెటిస్ రోగులు తప్పకుండ ఈ జాగ్రత్తలు పాటించండి..!
దేశంలో బీజేపీ పార్టీ అమలు చేస్తున్న విధానాలపై త్రిముక వ్యూహంతో పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. తెలంగాణలో పోడు భూముల సాధన కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులే.. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఎకరాలకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు ఇవ్వడాన్ని సీపీఐ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ప్రధాని మోడీ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Read Also: Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు.. క్లారిటీ ఇచ్చిన పవన్
ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఏడవ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ విద్వేషాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడతామన్నారు. బీజేపీలో సిద్దాంతం కంటే పదవులే ముఖ్యమని తేలిపోయింది అని కూనంనేని అన్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుపై కూనంనేని రియాక్ట్ అయ్యారు. అది వారి పార్టీ అంతర్గత వ్యవహారమైనా అందులో చాలా మత్లబ్ ఉందన్నారు. సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాలని కూల్చాలనే ఆలోచనలో బీజేపీ ఉందని సీబీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అన్నారు.